Monday, May 6, 2024

క‌ల చెదిరింది … క‌న్నుమూసింది.

ఖాడ్మండ్ – భారత్‌కు చెందిన పర్వతారోహకురాలు సుజానే లియోపోల్డినా జీసస్ క‌ల‌చెదిరింది.. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలన్న ఆమె చిర‌కాల‌వాంచ‌ను తీర్చేందుకు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు పేస్ మేక‌ర్ అమ‌ర్చారు…. దీంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శిఖరాన్ని ఎక్కేందుకు సిద్ధమైంది. అయితే బేస్‌క్యాంప్‌ వద్ద సాధారణ విన్యాసాల్లో ఆమె కనీసవేగాన్ని అందుకోలేక ఇబ్బంది పడింది. దీంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని అధికారులు ఆమెను కోరారు. అయినా వారి మాటలను ఆమె లెక్కచేయలేదు. ఎవరెస్ట్‌ ఎక్కేందుకు అన్ని అనుమతులు తెచ్చుకున్నానని.. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే తన ప్రయాణాన్ని కొనసాగించింది. బేస్ క్యాంప్ నుంచి 5,800 మీటర్ల ఎత్తుకు ఎక్కిన తర్వాత ఆమె ఆరోగ్యం సహకరించలేదు. దీంతో బలవంతంగా ఆమెను సోలుఖంబు జిల్లాలోని లుక్లా పట్టణంలో గల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది.. ఎంతో సాహసం చేసినా ఆమెకు చివ‌రి కోరిక నెర‌వేర‌కుండానే ప‌ర్వ‌త‌సానువుల‌లో క‌న్నుమూసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement