Friday, April 26, 2024

నెట్ ప్లిక్స్ లో అత్య‌ధికంగా చూసిన నాన్ ఇంగ్లీష్ మూవీగా – ఆర్ ఆర్ ఆర్ రికార్డ్

నెట్ ప్లిక్స్ లో అత్య‌ధికంగా చూసిన నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డ్ సృష్టించింది.. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంతో వస్తున్న సినిమా కావడంతో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, అలియాభట్, అజయ్ దేవ్ గన్ ఇలా భారీ తారాగణం ఉండటంతో సినిమాపై అంచానాలు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగానే వరల్డ్ వైడ్ గా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా సత్తా చాటింది ట్రిపుల్ ఆర్. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూసిన నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డ్ నమోదు చేసింది. కేవలం మే 23 నుంచి మే 29 వరకు ట్రిపుల్ ఆర్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో 1,83,60,000 గంటలు వీక్షించారు. దీంతో నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. దాంతో ఆర్ ఆర్ ఆర్ రికార్డుల్లో ఇది మ‌రొక‌ట‌ని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement