Wednesday, May 22, 2024

Ramadan: కనిపించిన నెల వంక…రేపటి నుంచి భారత లో రంజాన్ దీక్షలు ప్రారంభం…

పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబియాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం వెతికాయి. ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది.

- Advertisement -

ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఖతార్ కూడా సోమవారం రంజాన్ 2024 మొదటి రోజు అని ప్రకటించాయి. ఇక భారతదేశంలో మార్చి 12 నుండి ఉపవాసాలను పాటిస్తారు.భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో కూడా, పవిత్ర రంజాన్ మాసం మార్చి 12, మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ నెలలో, ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు 29 లేదా 30 ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఇది నెల ప్రారంభం, ముగింపును నిర్ణయించడంలో కీలకమైనది. రంజాన్ మాసం ముగిసిన తరువాత ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement