Saturday, June 15, 2024

TS | విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి..

అచ్చంపేట , ప్రభ న్యూస్ : విద్యుత్ ఘాతంతో చెట్టుపై నుండి పడి వ్యక్తి మరణించిన ఘటన అచ్చంపేట పట్టణంలో బుధవారం నాడు చోటుచేసుకుంది. అచ్చంపేట సీఐ రవీందర్ వివరణ ప్రకారం… బలుమూరు మండలం మైలారం గ్రామానికి చెందిన దినసరి కూలీ ఆరెకంటి రాములు (35), (బుధవారం) అచ్చంపేట పట్టణం వెంకటేశ్వర కాలనీలోని నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న వేపచెట్టు కొట్టివేయుటకు కూలి పనికి వెళ్లాడు.

అక్కడర చెట్టు పైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా హై టెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ ఘాతంతో మరణించినాడని తెలిపారు. మృతునికి భార్య కలమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య కళ్ళమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ రవీందర్ తెలిపారు. కాగా మృతి చెందిన ఆరె కంటి రాములు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement