Wednesday, May 22, 2024

Women reservation bill – ‘నారీశక్తి వందన్’ బిల్లు చారిత్రాత్మకం – ప్రధాని మోడీ

న్యూ ఢిల్లీ – ఆటల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మహిళా బిల్లు చాలా రోజులుగా పెండింగ్ ఉందని, నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చిందన్నారు

మహిళా రిజర్వేషన్లపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని సూచించారు. మహిళా రిజర్వేషన్ కి కట్టుబడి ఉన్నామని చెప్పారు. దీని కోసం ముందడుగు వేయబోతున్నామని తెలిపారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే భాగ్యం దేవుడు నాకు ప్రసాదించారని ప్రధాని మోడీ అన్నారు. ఈరోజు చరిత్రలో మిగిలిపోతుందని తెలిపారు. మహిళా సాధికారితపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని వ్యాఖ్యానించారు. మహిళా బిల్లుకు ‘నారీశక్తి వందన్’ బిల్లుగా నామకరణం చేశారు. నారీ శక్తి వందన్ తో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.

అంతకుముందు కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ్యులందరినీ ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఆధునికతకు అద్దం పట్టేలా, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం ప్రతీకగా నిలుస్తుందని, వినాయక చతుర్థి రోజున పార్లమెంట్ భవనంలోకి వచ్చామని, సభ్యులందర్ని ఆహ్వానించారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మన లక్ష్యమని ఆయన అన్నారు. చరిత్రను ప్రతిబింబిచేలా కొత్త పార్లమెంట్ ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అజాదీకా అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలం అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా పనిచేయాలని సూచించారు. నెహ్రూ చేతికి శోభనిచ్చిన సెంగోల్ కొత్త పార్లమెంట్ లో ఉందని ఆయన అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement