Friday, April 26, 2024

ఇప్పట్లో స్కూళ్లు తెరవలేం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పట్లో భౌతికంగా తరగతులు నిర్వహించలేమని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్.. కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పటికే ప్రారంభమైందనే సూచనలు అంతర్జాతీయంగా కనబడుతున్నాయని.. ఢిల్లీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే దాకా పిల్లలకు సంబంధించి ఎలాంటి రిస్క్‌ తీసుకోబోమని క్లారిటీ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో.. స్కూళ్లు తెరుస్తారా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. “లేదు, అంతర్జాతీయ పరిస్థితుల ప్రకారం, థర్డ్‌ వేవ్ వచ్చేస్తోంది.. కాబట్టి మొత్తం జనాభాకు టీకాలు వేయడం పూర్తయ్యే వరకు మేం పిల్లలను ప్రమాదంలోకి నెట్టబోమన్నారు. కాగా ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజువారి కేసులు 100 లోపే నమోదవుతున్నాయి.

ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు కేటీఆర్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement