Monday, May 6, 2024

మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే తాటికొండ

తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అండగా నిలిచాడు. వివరాలకెళ్తే..జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన మాచర్ల శాంతమ్మ – నర్సయ్య దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి..కుమారుడు మాచర్ల రాజు సునీతను అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..కొద్ది కాలం తర్వాత గొడవలతో భార్య భర్తలు ఇద్దరు ఒకేరోజు మృతిచెందారు.. దీంతో అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారారు..ఇట్టి విషయం పలు పత్రికల్లో వేలువడడం చూసి ఎమ్మెల్యే రాజయ్య చలించిపోయారు.. వెంటనే బుధవారం మీదికొండ గ్రామంలో ఆ చిన్నారుల నివాసాన్ని సందర్శించి వారి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు..అనంతరం చిన్నారులకు ఆర్థిక సాయం అందించారు.

చిన్నారులు మాచర్ల సౌమ్య, మాచర్ల సాంబరాజులను చదివించే పూర్తి బాధ్యత నాదేనని ఎమ్మెల్యే రాజయ్య హామీ ఇచ్చారు..ఆ చిన్నారులను జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చేర్పించి ఉన్నత చదువులు చదివే వరకు పూర్తి బాధ్యతతో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తయారు చేస్తాను.. అనంతరం చిన్నారులకు అన్ని విధాలుగా అండగా నేనున్నానని భరోసానిచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి , ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ నాగరబోయిన మణెమ్మ యాదగిరి, ఉప సర్పంచ్ పొన్నం రంజిత్ కుమార్ ,చిల్పూర్ గుట్ట దేవస్థాన డైరెక్టర్ పొన్నం రజిత, గ్రామ శాఖ అధ్యక్షుడు గొడుగు సంజీవ్ ,నియోజకవర్గ సోషల్ మీడియా నాయకులు జోగు వినయ్ కుమార్ , గ్రామ ఇంచార్జ్ జోగు కుమార్, మండల యూత్ ఇంచార్జ్ ఆకుల శివశంకర్, మండల నాయకులు జోగు కిష్టయ్య, జోగు రాజు, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు జోగు థామస్,గ్రామ యూత్ అధ్యక్షుడు జోగు సురేందర్ ,మండల మహిళా ప్రధాన కార్యదర్శి జోగు వసంత ,జోగు యాకయ్య తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement