Monday, April 29, 2024

హరీఓం లిస్టింగ్స్‌ భేష్‌.. 44 శాతం లిస్టింగ్‌ గెయిన్స్‌

హైదరాబాద్‌ : హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (కంపెనీ) బుధవారం 44 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ గెయిన్స్‌ సాధించింది. రూ.220 వద్ద లిస్ట్‌ చేయబడింది. ఈక్విటీ షేర్‌కు రూ.153 ఉండగా.. 44 శాతం అధికంగా ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అయ్యింది. అదేవిధంగా బీఎస్‌ఈలో ఒక్కో షేరు రూ.214 వద్ద లిస్ట్‌ చేయబడింది. దాని ఇష్యూ ధర రూ.153గా ఉండింది. బీఎస్‌ఈలో 40 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ గెయిన్స్‌ సాధించింది. మెటల్స్‌ అండ్‌ మైనింగ్‌ సెక్టార్‌లో ఉన్న హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. బీఎస్‌ఈలో రూ.214 వద్ద ప్రారంభమై.. గరిష్టంగా రూ.224.70 చేరుకుంది. ఇష్యూ ప్రైస్‌ కంటే రూ.71.70 (46.86 శాతం) అధికంగా లిస్టింగ్‌కు వచ్చింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో రూ.220 వద్ద ప్రారంభమై.. గరిష్టంగా రూ.231 వరకు వెళ్లింది. కనిష్టంగా రూ.215.20ను తాకింది. చివరికి రూ.231 వద్ద క్లోజ్‌ అయ్యింది. ఇష్యూ ప్రైస్‌ కంటే రూ.78 (50.98 శాతం) అధికంగా పలికింది.

వాటాదారులకు ధన్యవాదాలు..

హరిఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ రూపేష్‌ కుమార్‌ గుప్తా మాట్లాడుతూ.. హరిఓమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు మంచి లిస్టింగ్‌ గెయిన్స్‌ రావడం సంతోషంగా ఉందన్నారు. తమపై ఎంతో విశ్వాసం ఉంచిన వాటాదారులకు ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ మరింత అభివృద్ధి చెందేందుకు నాంది అని, పెట్టుబడిదారుల దీర్ఘ కాలిక వృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. తమ బాధ్యత మరింత పెరిగిందని, దీన్ని మరింత సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. 85,00,000 ఈక్విటీ షేర్లు లిస్‌ ్ట చేయబడ్డాయి. ఏప్రిల్‌ 5తో ఐపీఓ దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. బుధవారం లిస్టింగ్‌కు వచ్చింది. 12.15 రెట్లు అధికంగా సబ్‌ స్క్రైబ్‌ చేయబడింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్‌ కేటగిరీ 1.91 రెట్లు సబ్‌ స్రైబ్‌ అవ్వగా.. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ కేటగిరీ 8.87 రెట్లు సబ్‌స్రైబ్‌ అయ్యింది. మొత్తం మీద ఇష్యూ 7.93 రెట్లు సబ్‌స్రైబ్‌ చేయబడిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement