Wednesday, May 22, 2024

మిషన్‌ గుజరాత్‌, సొంత రాష్ట్రానికి మోడీ.. మూడు రోజుల పర్యటన

వచ్చే ఏడాది గుజరాత్‌లో అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి కళ్లు ఈ రాష్ట్రంపైనే ఉన్నాయి. మళ్లి గుజరాత్‌లో గెలుపును ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించేందుకు మోడీ నిర్ణయించారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు ప్రధాని గుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత.. మోడీ రెండో సారి గుజరాత్‌లో పర్యటించేందుకు నిర్ణయించారు. సోమవారం నుంచి మోడీ పర్యటన ప్రారంభం అవుతుంది. ఆ రోజు సాయంత్రం గాంధీనగర్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)ను సందర్శిస్తారు. ఆ తరువాత మంగళవారం ఉదయం దేవదర్‌లో బనాస్‌ డెయిరీగా ప్రసిద్ధి చెందిన బనస్కాంత జిల్లా కో ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌ లిమిటెడ్‌ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జామ్‌నగర్‌లో.. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రేడిషనల్‌ మెడిసిన్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం.. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌తో చర్చలు జరుపుతారు. బుధవారం ఉదయం.. గ్లోబల్‌ ఆయూష్‌ ఇన్వెస్ట్ మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ 2022లో పాల్గొంటారు. ఇది గాంధీనగర్‌లోని మహత్మా మందిర్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మారిషస్‌ ప్రధానితో కూడా భేటీ అవుతారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు దాహోద్‌, పంచ్‌మహల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం అక్కడి నుంచి ఢిల్లికి వెళ్లిపోతారు..

27ఏళ్లుగా అధికారం..

గత 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారం ఉంది. గత అసెంబ్లిd ఎన్నికల్లో.. బీజేపీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చింది. 182 అసెంబ్లి స్థానాలు ఉన్న గుజరాత్‌లో 41.4 శాతం ఓట్లతో 77 స్థానాలను దక్కించుకుంది. గత 32 ఏళ్లలో కాంగ్రెస్‌ ఈ స్థాయిలో గుజరాత్‌లో రాణించలేదు. దీంతో అప్రమత్తమైన బీజేపీ అధినాయకత్వం.. ఇప్పటి నుంచే అసెంబ్లి ఎన్నికలపై దృష్టిసారించినట్టు తెలుస్తున్నది. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. గుజరాతీలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. మిషన్‌ గుజరాత్‌ ఇప్పటి నుంచే ప్రారంభించింది. గుజరాత్‌లో బీజేపీ గెలుపు అటు ప్రధాని, ఇటు సీఎంకు ఓ సవాల్‌గా నిలిచింది. వచ్చే అసెంబ్లిd ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అధిష్టానం కూడా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా.. గతేడాది సెప్టెంబర్‌లో సీఎంతో పాటు పలువురు మంత్రులను మార్చేసింది. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్‌పై కన్నేసింది. పంజాబ్‌ను చేజిక్కించుకుని ఆప్‌ మాంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే గుజరాత్‌లో పలుమార్లు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ పర్యటించారు. గుజరాత్‌లో ఆప్‌తో పాటు కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే బీజేపీ.. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement