Saturday, April 27, 2024

America: జో బైడెన్‌కు త‌ప్పి ప్ర‌మాదం.. ఢీ కొట్టిన కారు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న కాన్వాయ్‌లోని కారును మరో కారు ఢీకొట్టింది. డెలావేర్‌లోని తన క్యాంపెయిన్ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అధ్యక్షుడు భద్రత నిమిత్తం కార్యాలయానికి సమీపంలో నిలిపి ఉంచిన ఓ కారును మరో కారు ఢీకొట్టింది. బైడెన్ తిరుగుప్రయాణమయ్యేందుకు కార్యాలయం నుంచి బయటకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు అధ్యక్షుడిని వడివడిగా అక్కడి నుంచి తరలించారు. బైడెన్, ఆయన భార్య సురక్షితంగా ఉన్నట్టు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement