Monday, April 29, 2024

“మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” రిలీజ్ డేట్ క‌న్ఫామ్.. విడుదల తేదీని ఖరారు చేసిన మేక‌ర్స్

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ నటుడు నవీన్ పోలిశెట్టి కలిసి చేస్తున్న మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీకి దీనికి మహేష్ బాబు రచన, దర్శకత్వం వహించారు. కాగా, చాలా రోజుల త‌రువాత ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ ఒక‌టి అందించారు మేక‌ర్స్.

- Advertisement -

ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమాని వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌చ్చే నెల (ఆగస్టు) 4న బహుళ (తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ) భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంభందించిన విష‌యాన్ని తెల‌య‌చేస్తూ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ మూవీని యువి క్రియేషన్స్ నిర్మిస్తుండ‌గా.. మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement