Tuesday, May 7, 2024

బాబీ డైరెక్ష‌న్ లో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం-డ‌బ్బింగ్ ప‌నులు ప్రారంభం

ద‌ర్శ‌కుడు బాబీ డైరెక్ష‌న్ లో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం డ‌బ్బింగ్ ప‌నులు నేడు మొద‌ల‌య్యాయి.కాగా దర్శకుడు బాబీ, పలువురు టెక్నీషియన్ల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేశారు. చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే ఈ చిత్రం నుంచి భారీ అప్ డేట్లు వస్తాయని తెలిపింది. బహుశా అది టైటిల్ కన్ఫర్మేషన్ అయ్యుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ దీపావళి నాడు వెలువడుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ అనే రెండు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో వాల్తేరు వీరయ్య అనే పేరును చిరంజీవి సూచించారు. మరి వీటిలో దేనిని చిత్రబృందం ఫిక్స్ చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement