Tuesday, April 30, 2024

భారీగా తగ్గుతున్న బులియన్‌..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా విపరీతంగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లి తగ్గుముఖం పట్టాయి. యుద్ధం కారణంగా ఏర్పడే ఉద్రిక్తత, అనిశ్చిత నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం, వెండిలపై సురక్షిత పెట్టుబడిగా భావిస్తుంటారు. ఈ క్రమంలో గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర గరిష్ఠంగా 1929డాలర్లుకు చేరింది. అదేవిధంగా వెండి ధర అంతర్జాతీయ విపణిలో 24.8డాలర్లకు చేరింది. అనంతరం శుక్రవారం రాత్రికి ఔన్సు బంగారం ధర 1888 డాలర్లుగా నమోదైంది. మరోవైపు వెండిధర కూడా 23.94డాలర్లుకు దిగివచ్చింది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తత మరింత ముదిరితే బంగారం ఔన్సు ధర 2000 నుంచి 2100 డాలర్లుకు చేరుకోవచ్చని అంచనాలు వెలువడ్డాయి.

అయితే అనూహ్యంగా బులియన్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా హైదరాబాద్‌ బులియన్‌ ట్రేడింగ్‌లో 10గ్రాముల మేలిమి బంగారం 53,100, కిలో వెండి రూ.68,600గా గురువారం నమోదైంది. అనంతరం ఈ ధరలు శుక్రవారం నాటికి బంగారం 51,800, వెండి కేజీ ధర 68,600గా నమోదైంది. స్టాక్‌మార్కెట్లు కోలుకోవడంతో 24క్యారెట్ల బంగారం ధర రూ.49వేల నుంచి 50వేలు, వెండి కిలో 62వేలు నుంచి 63వేలుకు తగ్గవచ్చని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement