Saturday, May 4, 2024

కోహ్లీ టెస్ట్ మ్యాచ్ ల రికార్డ్.. మొహాలి వేదికగా 100వ టెస్ట్..

మొహాలి వేదికగా మార్చి 4న భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. విరాట్ కోహ్లీకి కెరీర్‌లో ఇది 100వ టెస్టు. ఈ నేపథ్యంలో.. మ్యాచ్‌ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తొలుత ప్లాన్ చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఐపీఎల్ 2022 సీజన్ కారణంగా వెనక్కి తగ్గింది. మొహాలి టెస్టుకి ప్రేక్షకుల్ని అనుమతించొద్దని పంజాబ్ క్రికెట్ అసోషియేషన్‌కి తాజాగా బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దాంతో.. కోహ్లీ తన 100వ టెస్టుని ఖాళీ స్టేడియంలో ఆడనున్నాడు.

భారత టెస్టు జట్టుకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టబోతున్న రోహిత్ శర్మ కెప్టెన్సీలో కోహ్లీ తన వందో టెస్టు మ్యాచ్ ఆడనుండడం గమనార్హం. ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన కోహ్లీ 50.39 సగటుతో 7,962 పరుగుుల సాధించాడు. అందులో 27 సెంచరీలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement