Friday, April 26, 2024

సైన్యానికి మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ .. జూడో, కరాటేతో శత్రువులను మట్టుబెట్టే లక్ష్యం

సైన్యంలోని సిబ్బంది కాల్పులు జరపడమే కాదు.. ఇక నుంచి మార్షల్‌ ఆర్స్ట్‌లో కూడా తమ ప్రతాపాన్ని శత్రుసైన్యంపై చూపిస్తారు. కరాటేలో ఉన్న 15 నుంచి 20 రకాల కఠినమైన శిక్షణను తీసుకుంటున్నారు. ఐటీబీటీకి చెందిన సైన్యం కరాటేలో టెక్నికల్‌ శిక్షణను తీసుకుంటున్నారు. 2020 గాల్వాన్‌ ఘటనలో చైనాతో భారత ఆర్మీ ఎదుర్కొన్న విషాధ సంఘటనను ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజిపి ఈశ్వర్‌ సింగ్‌ తెలిపారు. శత్రువులను మట్టి కరిపించేలా జూడో, కరాటేలో మూడు నెలలపాటు ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గుద్దడం, తన్నడం, విసిరేయడం, జాయింట్‌ లాక్‌, పిన్నింగ్‌ వంటి వాటితో ఊపిరాడకుండా చేయడమే లక్ష్యం. గత సంవత్సరమే మాజీ డీజీపీ సంజయ్‌ ఆరోరా ఈ శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. చండీగర్‌కు 25 కిలోమీటర్ల పరిధిలో పంచకులలోని భానులో కరాటే శిక్షణ ఇస్తున్నారు. 2020లో లడక్‌లో నిఘా పోస్టును ఏర్పాటు చేయడాన్ని నిరసించిన తరువాత చైనా సైన్యం భారత్‌పై క్రూరమైన పద్ధతిలో దాడులకు దిగింది.

రాళ్లతో కొట్టడం, ముల్లులు ఉన్న లాఠీలు, ఇనుప రాడ్లు వంటి వాటితో దాడులు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 20 మంది భారత సైన్యం మృతిచెందారు. అయితే భారత్‌ సైన్యం చేతిలో ఎవరూ చనిపోలేదని పేర్కొంది. రష్యన్‌ చెందిన టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ చైనా సైనికులు 45 మంది వరకు గాల్వాన్‌లో చనిపోయినట్లు, అమెరికన్‌ ఇంటలిజెన్స్‌ రిపోర్టులో 35 మంది చైనా సైనికులు చనిపోయినట్లు పేర్కొంది. ప్రత్యర్థిని పవర్‌ పంచ్‌తో భూమిపై మట్టి కరిపించేలా శిక్షణ ఇస్తామన్నారు. ఐజిపి మాట్లాడుతూ శారీరక దృఢత్వంతో సైన్యం వాస్తవవాదీన రేఖ వెంట ఉన్న సైన్యం శక్తివంతంగా ఉండేలా ఆక్సిజన్‌ లెవల్‌ను తట్టుకునేలా.. మంచు కొండల్లో తమను తాము రక్షించుకునేలా శిక్షణ ఇస్తున్నారు. 90 రోజుల్లో శిక్షణ పూర్తి చేసేలా తయారు చేసినట్లు చెప్పారు. ఐటీబీటీలో సుదీర్ఘకాలం సిబ్బందిని ఎక్కువరోజులు ఉంచడంతో బలహీనమైపోతున్నట్లు డీఆర్‌డీఓ ద్వారా తెలుసుకున్నామని.. దీనివల్ల శరీరం కోలోకోలేని స్థితిలోకి వెళుతుందోన్నారు.

గత నెలలో పెట్రోలింగ్‌ 15 ప్రాంతంలోని గోగ్రా హాట్‌స్ప్రింగ్‌లో సైన్యం వెదొలిగారు. డెమ్‌చోక్‌ .. దెస్‌పాంగ్‌ రీజియన్‌లలో చాలా ప్రతిష్టంభన ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. లడక్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు ఉన్న వాస్త వాదీన రేఖ 3,488 కి.మీలో ఉంంది. దీనికి శక్తివంతమైన 98వేల ఐటీబీటీ సైన్యం రక్షణగా ఉంటోంది. వీరికి ఏవైనా శత్రువుల నుంచి ప్రతిఘటన ఎదురైన క్షణంలో ఆయుధాలతోపాటు .. శత్రువును కరాటే, జూడోతో మట్టికరిపించడంతోపాటు సైన్యం శక్తివంతంగా తయారు కావడమే లక్ష్యమని ఐజిపి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement