Sunday, April 28, 2024

‘గాలి నాగేశ్వ‌ర‌రావు’గా మంచు విష్ణు

హీరో మంచు విష్ణు గాలి నాగేశ్వ‌ర‌రావు అనే డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ తో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ మేర‌కు విష్ణు సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నారు విష్ణు అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంతో ఈషాన్ సూర్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ప్ర‌ముఖ ర‌చ‌యిత, నిర్మాత కోన‌వెంక‌ట్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌డంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అవ ఎంట‌ర్టైన‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స్వ‌ర ప‌రుస్తుండ‌గా చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement