Monday, March 25, 2024

Shane Warne: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లుకు టీమిండియా ఘన నివాళి

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రోడ్నీ మార్ష్, షేన్ వార్న్‌లు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణంపై యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైయింది. నిన్న థాయ్ లాండ్ లో గుండె పోటుతో షేన్ వార్న్ మరణించారు. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ మృతిపై టీమిండియా నివాళులు అర్పించింది. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటకు ముందు ఒక నిమిషం పాటు ఆటగాళ్లు మౌనం పాటించారు. షేన్ వార్న్ తో పాటు మరో ఆస్ట్రేలియన్ దిగ్గజం రాడ్ మార్ష్ కు సంతాప సూచకంగా మైదానంలో నిలబడి మౌనం పాటించారు. సంతాప సూచకంగా నల్లటి ఆర్మ్ బ్యాండ్ తో ధరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement