Monday, May 6, 2024

Breaking: ‘జిన్నా’ పేరుతో మంచు విష్ణు సినిమా.. టైటిల్ పై బీజేపీ లీడర్ల అభ్యంతరం

న‌టుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ‘జిన్నాస పేరుతో ఉన్న చిత్రం తీస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఈ సినిమా టైటిల్ పై బీజేపీ లీడ‌ర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘జిన్నా’ అనే టైటిల్ తొలగించాల‌ని కోరుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ ను తిరుమల ఏడుకొండల మ‌ధ్య పైకి వ‌స్తున్న‌ట్టు చూపించ‌డం కూడా బాగాలేద‌ని, దీనిపై బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరుతో సినిమా తీయడమేంటని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ప్రశ్నించారు. మంచు విష్ణు చరిత్ర తెలుసుకోవాలని హితవుపలికారు. జిన్నా కారణంగా ఎంతోమంది హిందువులు మాన, ప్రాణాలు కోల్పోయారని, వారి గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. జిన్నా మూవీలో మంచు విష్ణు, గాలి నాగేశ్వరరావు అనే పాత్ర పోషిస్తున్నాడు. ఈ గాలి నాగేశ్వరరావు పేరునే షార్ట్ కట్ లో ‘జిన్నా’ అని కుదించి దాన్నే టైటిల్ గా ఫిక్స్ చేశారు. దీంతో ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అయితే దీనిపై కోన వెంకట్​ స్పందించారు. అందరి మనోభావాలను గౌరవిస్తామని, తిరుపతి కుర్రాడి నేపథ్యంలోనే ఈ కథ ఉంటుందని తెలిపారు. నిర్మాతతో మాట్లాడి టైటిల్​ సరిచేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement