Wednesday, April 24, 2024

మేడారంలో సందడి, తల్లుల దర్శనానికి తరలివచ్చిన భక్తులు

తాడ్వాయి (ప్రభన్యూస్) : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు తరలి వచ్చారు. హైదరాబాద్, నల్గొం, మహబూబ్‌న‌గర్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచే కాకుండా.. ఆంద్ర ప్రదేశ్, ఛత్తీస్‌గ‌ఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి పొరుగు రాష్ర్టాల నుంచి కూడా పెద్ద ఎత్తున‌ భక్తులు తరలి వచ్చారు.

ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన‌ అనంతరం అమ్మ‌వారి గద్దెల‌ వద్దకు చెరుకుని తల్లులకు పసుపు, కుంకుమ.. పూలు పండ్లు, నూతన వస్త్రాలు, బెల్లం, కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర పరిసర ప్రాంతాలైన చిలుకలగట్టు మ్యూజియం, సారలమ్మ గుడి.. తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తల్లులకు కోళ్లు, మేకలను నైవేద్యంగా ఎదుర్కోళ్లు సమర్పించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ర‌ద్దీకి త‌గ్గ ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement