Saturday, April 27, 2024

మామా మ‌శ్చీంద్ర నుంచి దుర్గా లుక్..

సుధీర్‌ బాబు కథానాయకుడిగా నటుడు దర్శ కుడు హర్షవర్ధన్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పి పై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర .ఈ చిత్రంలో హరోని మూడు విభిన్న షేడ్ల్సో చూపించ బోతున్నారు హర్షవర్ధన్‌ . సుధీర్‌ బాబు దుర్గ, పరశురామ్‌, డీజే మూడు పాత్ర లలో కనిపి స్తారు. మేకర్స్‌ ఈరోజు దుర్గ లుక్‌ విడుదల చేసారు. పొడవాటి జుట్టు , గడ్డంతో సుధీర్‌ బాబు ఇక్కడ కొంచెం లావుగా కనిపిస్తు న్నాడు. ఈ పాత్ర ఊబకాయంతో ఉండే వ్యక్తిగా ఉండబోతుంది అని తెలుస్తుంది. కారు బానెట్‌ పై కూర్చున్న సుధీర్‌ బాబు బంగారు గొలుసు వాచ్‌, ట్రెండీ అవుట్‌ ఫిట్‌ ధరించి విలనీ స్మైల్‌ తో కనిపించాడు. నైట్రో స్టార్‌ మేక్‌ఓవర్‌ ఆశ్చర్యం కలిగించే లాగా ఉంది. సుధీర్‌ బాబు ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేయడా నికి ప్రయత్నిస్తాడు.ఈ పాత్ర పూర్తిగా విలక్షణమైనదిగా కనిపిస్తుంది. మామా మశీంద్ర అనే టైటిల్‌ నైట్రో స్టార్‌ సుధీర్‌ బాబు యొక్క మల్టి షేడ్‌ క్యారెక్టర్‌ సూచిస్తుంది. పరశురామ్‌ లుక్‌ ని ఈ నెల 4న, డీజే లుక్‌ ని 7న విడుదల చేయనున్నారు. సష్టి సెల్యులాయిడ్‌ కి చెందిన సోనాలి నారంగ్‌, సష్టి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తెలుగు, హందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement