Tuesday, May 14, 2024

Taiwan : విమానంలోనే పురిటి నొప్పులు … పురుడు పోసిన పైలెట్

విమానంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు పైలట్‌ విజయవంతంగా డెలివరీ చేశాడు. ఈ అనూహ్య ఘటన వీట్‌జెట్‌కు చెందిన విమానంలో చోటు చేసుకొంది. వివ‌రాలోకి వెళితే .. తైవాన్‌ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన విమానంలో ఒక గర్భిణి కూడా ఉన్నారు.

టేకాఫ్‌ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్‌రూంలో ఆమెను చూసిన సిబ్బంది విషయాన్ని పైలట్‌ జాకరిన్‌కు తెలియజేశారు. ల్యాండింగ్‌కు ఇంకా సమయం ఉండడంతో డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సమయానికి విమానంలో వైద్యులు కూడా లేకపోవడంతో పైలట్‌ తల్లిబిడ్డలను కాపాడే ప్రయత్నం చేశాడు. ముందుగా తన బాధ్యతలను కో-పైలట్‌కు అప్పగించాడు. సెల్‌ఫోన్‌ ద్వారా వైద్యులను సంప్రదించిన పైలట్‌ వారి సూచనలతో పురుడు పోశాడు.

- Advertisement -

బిడ్డ‌కు స్కై పేరు..
విమానంలో జన్మించిన ఈ చిన్నారికి సిబ్బంది ముద్దుగా ‘స్కై’ అని పేరు పెట్టారు. ల్యాండింగ్‌ అనంతరం తల్లిబిడ్డలను వైద్య సిబ్బంది పరీక్షించారు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. 18 ఏళ్లుగా పైలట్‌గా వ్యవహరిస్తున్న జాకరిన్‌ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement