Tuesday, May 7, 2024

టీచర్ తో ప్రేమాయణం… కానీ ఆత్మహత్య !! ఏమైందో తెలుసా?

ప్రేమించిన వాడు మాట్లాడట్లేదని ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్వర్ ఉలూమ్ కాలేజ్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షిఫా నాజ్ కాలేజీ ఆవరణలో నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది.

విద్యార్థిని ఆత్మ హత్య కు కారణం తన చదువుతున్న విద్యాసంస్థలోనే చదువు చెపుతున్న NCC ఉపాధ్యాయుడు నోషాద్ తో ప్రేమ వ్యహారమే కారణమంటూ తెలుస్తుంది. గత కొంత కాలం నుండి నోషాద్ తనతో మాట్లాడం మానేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement