Saturday, April 27, 2024

వ్యాక్సిన్ తీసుకుంటే.. బంగారు ముక్కుపుడక ఫ్రీ!

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజులో అత్యధికంగా 1,03,558 కొత్త కేసులు వచ్చాయి. కరోనా నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటుంన్నాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైపడిన వారికి టీకాలు వేస్తున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నా.. టీకాపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు.

ఈ నేపథ్యంలో గుజరాత్ లో రాజ్ కోట్ ప్రాంతంలో బంగారం వ్యాపారులు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. వ్యాక్సిన్ వేయించుకునే మహిళలకు ఉచితంగా బంగారు ముక్కుపుడక ఇస్తామని ప్రకటించింది. అదే పురుషులు వ్యాక్సిన్ వేయించుకుంటే… హ్యాండ్ బ్లెండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. ప్రజల్లో చైత్యనం పెంచుతూ వ్యాక్సిన్ వేయించుకునేలా చేయించేందుకు బంగారు వ్యాపారుల సంఘం ఈ ఆఫర్ తెచ్చింది. ఆల్ ఫ్రీకి అలవాడు పడిన ప్రజలు..కనీం ఇలాగైనా వ్యాక్సిన్ వేయించుకుంటారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement