Thursday, April 25, 2024

మీకు ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా? ఇలా చేయండి

భారత్‌లో ప్రస్తుతం గ్యాస్ పొయ్యి లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే కొత్తగా గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే ఇప్పటి వరకు డబ్బులు కట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీం కింద అర్హత ఉన్న వారికి కనెక్షన్ ఉచితంగా ఇస్తోంది. కోటి మందికి ఇలా ఇస్తుంది. ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వం నేరుగా రూ.1,600 సబ్సిడీ ఇస్తుంది. అదే విధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా రూ.1,600 సబ్సిడీ ఇస్తాయి. అంటే మీకు సిలిండర్ కనెక్షన్ ఉచితంగా వస్తుంది. అయితే ఒక చిన్న లాజిక్ ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇచ్చిన రూ.1,600ను వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళలు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. తొలుత ఎల్‌పీజీ సెంటర్‌‌కు వెళ్లి ఫామ్ నింపాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించాలి. 14.2 కేజీల సిలిండరా లేక 5 కేజీలా అనేది మీ అవసరం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కనెక్షన్ కావాల్సిన వారికి తప్పనిసరిగా బీపీఎల్ కార్డు, రేషన్ కార్డు ఉండాల్సిందే. అలాగే 18 ఏళ్ళు నిండి ఉండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement