Thursday, May 2, 2024

జురాసిక్ పార్క్ లో డైనోసార్ లా.. రికార్డుల‌మీద దూసుకుపోతున్న‌ ప్ర‌భాస్‌

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ క‌మింగ్ మూవీ స‌లార్ టీజ‌ర్ నిన్న తెల్లవారుజామున రిలీజ్ అయ్యింది. అభిమానులు, ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌తో దూసుకుపోతోంది ఈ టీజ‌ర్. సోషల్ మీడియాలో దీనికి వచ్చిన రెస్పాన్స్ స‌లార్ చుట్టూ ఉన్న హైప్‌ని సూచిస్తోంది. కేవలం 24 గంటల్లోనే టీజర్ ఇంటర్నెట్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది.

రెండు నిమిషాల లోపు నిడివి ఉన్న టీజర్‌లో హైఆక్టేన్ యాక్షన్ సీన్స్ నుండి విజిల్ వేసే డైలాగ్‌లు.. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు అన్నీ ఉన్నాయి. ఈ టీజర్ ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 83 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తొలిరోజు టీజర్లలో ఇదే రికార్డు.

ఇక‌.. మొదటి రోజు టీజర్‌కి స‌లార్ 83 మిలియన్ వ్యూస్ సాధించడంతో, ప్రభాస్ 68.9 మిలియన్ వ్యూస్‌తో ‘ఆదిపురుష్’ నెలకొల్పిన తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఆ తర్వాత 68.8 మిలియన్ వ్యూస్‌తో ‘KGF చాప్టర్ 2’, 42.6 మిలియన్ వ్యూస్‌తో ‘రాధే శ్యామ్’ ఉన్నాయి. మొదటి రోజు అత్యధికం వ్యూస్ సాధించిన‌ టాప్ 5 టీజర్‌లలో 3 ప్రభాస్‌కు సినిమాలే ఉండ‌టం విశేషం.

- Advertisement -

స‌లార్ పార్ట్ 1లో ప్రభాస్ తో పాటు.. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు ఉన్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీని హోంబలే ఫిలింస్ నిర్మిస్తోండ‌గా.. ఈ సినిమా సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీతో సహా 5 భాషల్లో థియేటర్లలోకి రావడానికి సిద్దంగా ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement