Tuesday, May 7, 2024

Lay Offs | మైక్రోసాప్ట్‌లో మరోసారి లేఆఫ్స్‌..

దిగ్గజ టెక్‌ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలోనే 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని మైక్రోసాప్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రానున్న రోజుల్లో గతంలో ప్రకటించిన దానికంటే అదనంగా కోతలు ఉంటాయని తాజాగా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి వారం అనంతరం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపింది. తాజా తొలగింపుల్లో భాగంగా వాషింగ్టన్‌ కార్యాలయంలోని ఉద్యోగుల్లో 276 మందికి ఉద్వాసన పలికింది.

అందులో 66 మంది వర్చువల్‌గా పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరిలో సేల్స్‌, కస్టమర్‌ సక్సెస్‌ రిప్రజెంటేటివ్స్‌ తాము ఉద్యోగాలు కోల్పోయినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. తమ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్‌లు తీసుకొచ్చిన్నట్లు మైక్రోసాప్ట్‌ ఇటీవల వెల్లడించింది. రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ప్రకటించిన ఆ సంస్థ, ఎంతమందిని తొలగిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

- Advertisement -

”సంస్థాగత, శ్రామిక సర్దుబాట్లు మా వ్యాపార నిర్వహణలో సాధారణం. మా సంస్థ భవిష్యత్‌ కోసం కస్టమర్లకు మద్దతుగా వ్యూహాత్మక వృద్ధి రంగాలకు ప్రాధాన్యమిస్తూ పెట్టుబడి కొనసాగిస్తాం” అని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే అమెజాన్‌, గూగుల్‌, ట్విటర్‌తో పాటు ప్రముఖ టెక్‌ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. కొవిడ్‌ సమయంలో ఎదురైన పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు, మాంద్యం భయాలతో కంపెనీలన్నీ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement