Wednesday, May 8, 2024

ఎట్ట‌కేల‌కు ఖుషి చిత్రం అప్ డేట్

ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వస్తున్న చిత్రంఖుషి..ఈ చిత్రంలో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ , హీరోయిన్ గా సమంత నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన శివ‌నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులకు శివనిర్వాణ- విజయ్ దేవరకొండ టీం క్రేజీ అప్డేట్ అందించింది.యాక్షన్‌ సీక్వెన్స్ తో ఖుషి కొత్త షెడ్యూల్‌ మొదలు కానుందని డైరెక్టర్ శివ నిర్వాణ తెలియజేశారు. మార్చి 8న తాజా షెడ్యూల్‌ షురూ కానున్నట్టు సమాచారం. పాపులర్ స్టంట్‌ మాస్టర్‌ పీటర్ హెయిన్స్, ఎడిటర్‌ ప్రవీణ్ పూడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ అప్‌డేట్‌ను షేర్ చేసుకున్నాడు శివనిర్వాణ. ఈ స్టిల్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఖుషి చిత్రంలో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ నటుడు జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఖుషి నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తొలిసారి విజయ్ దేవ‌ర‌కొండ, సమంత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండటంతో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లకు వస్తుందా.. అని చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement