Monday, May 6, 2024

ఆక‌ట్టుకుంటోన్న కృష్ణ‌మ్మ టీజ‌ర్

విభిన్న క‌థా చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు హీరో స‌త్య‌దేవ్. కాగా ఆయ‌న న‌టిస్తోన్న తాజా మూవీ కృష్ణ‌మ్మ‌. ఈ చిత్ర టీజ‌ర్ రిలీజ్ అయింది. నిమిషానికి పైగా ఉన్న టీజర్ ఆద్యంతం సీరియస్ నోట్ లో సాగింది. ముగ్గురు అనాథ మిత్రుల కథగా కృష్ణమ్మ తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి పుట్టారో తెలియని ముగ్గురు మిత్రుల ప్రశాంత జీవితాన్ని ఎవరో డిస్ట్రబ్ చేస్తారు. అక్కడి నుండి వాళ్ళ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సవాళ్లు. వాళ్ళను టార్గెట్ చేసింది ఎవరు? ఆ సమస్యల నుండి ముగ్గురు మిత్రులు ఎలా బయటపడ్డారు అనేదే కృష్ణమ్మ మూవీ కథగా చెప్పవచ్చు. సత్యదేవ్ డీగ్లామర్ లుక్ ఆకట్టుకుంది. ఆయన గతంలో ఎన్నడూ చేయని సరికొత్త రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో స‌త్య‌దేవ్‌కు జోడీగా అతిరా రాజీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మ‌ల‌పాటి నిర్మిస్తున్నారు. మొత్తంగా కృష్ణమ్మ టీజర్ అంచనాలు పెంచేసింది. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించాడు. వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. కాల భైరవ సంగీతం అందించారు. విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement