Saturday, April 27, 2024

వీడియో: ఔటయ్యాక కోహ్లీ ఫస్ట్రేషన్ చూడండి..

ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ ఆటతీరుపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అభిమానులే కాదు విరాట్ కోహ్లీ సైతం ఫస్ట్రేషన్ కి గురవుతున్నాడు. మొదటి మూడు మ్యాచుల్లో పేలవంగా ఆడి ఔటయిన కోహ్లీ నాలుగో మ్యాచ్ లో 50 కొట్టి కాస్త టచ్ లోకి వచ్చినట్లే కనిపించాడు. అయితే ఇదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో మంచి ఫామ్ లో కనిపించిన కోహ్లీ ఈ సారి సెంచరీ కన్ఫమ్ అనేలా జోరు ప్రదర్శించాడు. అయితే అనుహ్యంగా మొయిన్ అలీ బౌలింగ్ లో సింఫుల్ క్యాచ్ ఇవ్వటం ద్వారా పెవిలియన్ బాట పడ్డారు. కోహ్లీ చేసిన 44 రన్స్ లో ఏడు ఫోర్లు ( అంటే 28 పరుగులు ఫోర్లు కొట్టటం ద్వారానే వచ్చాయి) ఉండటం గమనార్హం.

ఇక ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ.. మంచి ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టినట్లుగా అందరూ భావిస్తున్న వేళ.. అనూహ్యంగా ఔట్ కావటం.. కోహ్లీని తీవ్రమైన నిరాశకు.. అంతకు మించిన ఆగ్రహానికి గురి చేసిందన్న విషయం.. తాజాగా బయటకు వచ్చిన వైరల్ వీడియో వెల్లడించింది. చూడచక్కని బ్యాటింగ్ తో దూసుకెళుతున్న వేళ.. మాంచి ఇన్నింగ్స్ చేస్తానన్న కాన్ఫిడెన్సులో ఉన్నారేమో కానీ.. ఔట్ అయిన వెంటనే ఆయన తన వేదనను ప్రదర్శించారు.

పెవిలియన్ నుంచి డ్రెస్సింగ్ రూంలోకి వెళుతూ.. గ్లోవ్స్ తోనే గోడను బలంగా కొట్టిన సీన్ ఒకటి వైరల్ అవుతోంది. గడిచిన రెండేళ్లుగా కోహ్లీ సెంచరీ సాధించలేదు. యాభై పరుగులు దాటిస్తున్నా.. వందకు మాత్రం చేరుకోలేకపోతున్నాడు. ఇది అతనిలో ఆగ్రహాన్ని పెంచుతుందన్న మాట వినిపిస్తోంది. తాజా ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించలేకపోయానన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదే విషయం ఆయన ముఖంలోనే కాదు.. చేతల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ చిట్టి వీడియో వైరల్ గా మారింది.

https://twitter.com/virat_fanboyy/status/1434481522338271235

ఇది కూడా చదవండి: రహానే ను పక్కన పెట్టాల్సిన సమయం ఇదే: వీవీఎస్‌ లక్ష్మణ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement