Thursday, April 25, 2024

రహానే ను పక్కన పెట్టాల్సిన సమయం ఇదే: వీవీఎస్‌ లక్ష్మణ్‌

టీమిండియా బ్యాట్స్ మెన్ రహానే ఫేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. దీంతో అతనికి జట్టులో చోటుపై ఆందోళన నెలకొంది. నాలుగో టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగిన రహానే మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. గతేడాది మెల్‌బోర్న్‌ టెస్టులో చివరిసారి సెంచరీ చేసిన రహానే ఆ తర్వాత ఆడిన 11 టెస్టుల్లో అతని  యావరేజ్‌ 20 దాటలేదంటే ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో అర్థశతకంతో మెరిసినప్పటికీ అదే ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు.

ఇక అంజిక్య రహానేపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో సిరీస్ లో రహానే ఆటుతిరు పై లక్ష్మణ్ ఈ విధంగా వ్యాఖ్యనించారు. ప్రస్తుతం అతని ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. భవిష్యుత్తులో ఇలాగే ఉంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుంది. కోహ్లి రహానేపై నమ్మకంతో అతనికి అవకాశాలు ఇస్తూ వచ్చాడు. రహానే వాస్తవానికి మంచి టెక్నిక్‌ ఉన్న ఆటగాడు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. అయితే అతను ఇప్పుడు ఫామ్‌ కోల్పోయాడు.. లయను తిరిగి అందుకోవాలంటే కొంతకాలం బ్రేక్‌ ఇవ్వాలి. నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో రహానే క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడుతూనే కనిపించాడు. రహానే ఎదుర్కొన్న 8 బంతుల్లో ఒకసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ మరోసారి అలాంటి బంతే పడినప్పటికీ కనీసం అంచనా వేయలేకపోయాడు. డకౌట్‌గా వెనుదిరిగి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. రహానే స్థానంలో కొన్నాళ్లు కొత్త ఆటగాళ్లైన శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: సిరీస్ గెలవాలంటే కోహ్లీని నిశబ్దంగా ఉంచాలి: జో రూట్

Advertisement

తాజా వార్తలు

Advertisement