Sunday, April 28, 2024

కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘మీటర్’ ఓటీటీ రిలీజ్ డేట్..

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం లేటెస్ట్ మూవీ మీట‌ర్. ఈ సినిమా నిన్న (శుక్ర‌వారం) థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. రివేంజ్ డ్రామాతో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు ర‌మేష్ క‌దూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిగా, అతుల్య ర‌వి హీరోయిన్‌గా న‌టించింది.. కాగా, ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే మీట‌ర్ డిజిట‌ల్ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం.

మే ఫ‌స్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంది. నిన్న (శుక్ర‌వారం) థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకు కంప్లీట్‌గా నెగెటివ్ టాక్ వ‌చ్చింది. రొటీన్ రివేంజ్ ఫార్ములాతో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement