Saturday, April 27, 2024

పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ అబ్బ‌వ‌రం.. మీట‌ర్ నుండి పోస్ట‌ర్

పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించ‌నున్నాడు హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఈ మేర‌కు మీట‌ర్ చిత్రం నుండి పోస్ట‌ర్ రిలీజ్ అయింది. విభిన్నమైన కథాంశంతో మీటర్ సినిమా తెర‌కెక్కుతోంది. .క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కిరణ్ అబ్బవరం లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రొమాంటిక్ టచ్ తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement