Thursday, April 18, 2024

రావ‌ణాసుర టీజ‌ర్ రిలీజ్.. ఎప్పుడంటే

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టిస్తోన్న చిత్రం రావ‌ణాసుర‌. ఈ చిత్రం టీజ‌ర్ ని ఈ నెల 6న ఉద‌యం 10 :08 గంటలకు రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సందర్భంగా కొత్తపోస్టర్ ని రిలీజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.యంగ్ హీరోయిన్స్ అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్ ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఊహించని మలుపులు, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement