Friday, April 26, 2024

ఉత్తర కొరియా మరో కొత్త ప్రయోగం..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరికి తెలియదు. వివాదాస్పద నిర్ణయాలు, ఎవరైతే నాకేంటి అంటూ ఇచ్చే ప్రకటనలు, వివాదాస్పద చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఉత్తర కొరియా నియంత కిమ్‌… తాజాగా, కొత్త త‌ర‌హా హైప‌ర్‌సోనిక్ క్షిప‌ణిని ప‌రీక్షించింది ఉత్తర కొరియా. హాసంగ్‌-8గా ఆ మిస్సైల్‌ను పిలుస్తున్నారు. అయిదేళ్ల సైనిక అభివృద్ధి ప్రణాళిక‌లో భాగంగా అయిదు కొత్త ఆయుధాల‌ను త‌యారు చేశామ‌ని, దాంట్లో ఈ మిస్సైల్ కూడా ఒక‌టని నార్త్ కొరియా తెలిపింది. ఇదొక వ్యూహాత్మక ఆయుధ‌మ‌ని ఆ దేశం చెబుతోంది. ఉత్తర కొరియా ఇచ్చిన సంకేతాల ప్రకారం కొత్త హైప‌ర్‌సోకిన్ మిస్సైల్‌కు అణ్వాయుధ సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రీక్ష‌తో.. నార్త్ కొరియా వెపన్ టెక్నాల‌జీలో మ‌రింత బ‌లోపేతం అయిన‌ట్లు అర్థమ‌వుతోంది. కొత్త ఆయుధంతో త‌మ ఆత్మర‌క్షణ సామ‌ర్థ్యం పెరిగిన‌ట్లు ఉత్తర కొరియా తెలిపింది. ఈ మ‌ధ్యనే క్రూయిజ్‌, బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను ఆ దేశం ప‌రీక్షించింది.

ఇది కూడా చదవండి: వీడియో: సైలెంట్ గా వచ్చిన చిరుత..బామ్మ ఏం చేసిందంటే..?

Advertisement

తాజా వార్తలు

Advertisement