Friday, April 26, 2024

జనసేనానికి షాక్.. పవన్ శ్రమదానానికి నో పర్మిషన్!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం, జనసేన పార్టీ మధ్య రాజకీయ వైరం ముదురుతోంది. వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన పవన్.. వచ్చే ఎన్నికల్లో కేలవం 15 సీట్లే వస్తాయంటూ జోస్యం చేప్పారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఆక్టోబర్ 2న శ్రమదానం చేయాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీపై, అనంతపురం జిల్లా కొత్తచెరువలో పవన్ శ్రమదానం చేస్తానని ప్రకటించారు. ఇందుకు సంబందించిన ఏర్పాట్లును జనసైనికులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, కాటన్ బ్యారేజీ వద్ద పవన్ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. బ్యారేజీపై మరమ్మతులు చేయడానికి వీల్లేదని.. గుంతలు పూడిస్తే బ్యారేజీ నష్టమని తెలిపారు. అంతేకాకుండా కాటన్ బ్యారేజీ ఆర్ అండ్ బీ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.

మరోవైపు జనసేన పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిననా తాము మాత్రం బ్యారేజీపై శ్రమదానం చేసి తీరుతామని తేల్చి చెబుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తమను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు.

కాగా, ఇటీవల రాష్ట్రంలోని రోడ్లను బాగుచేయాలంటూ జనసేన సోషల్ మీడియా ఉద్యమాన్ని కూడా చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రోడ్లను మరమ్మతులు చేసేందుకు శ్రమదానం కార్యక్రమానికి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తాను కూడా రెండు చోట్ల పాల్గొంటానని ప్రకటించారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, అనుహ్యంగా ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో అక్టోబర్ 2న ధవళేశ్వరం వద్ద ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. అసలేం జరిగింది?

Advertisement

తాజా వార్తలు

Advertisement