Sunday, October 17, 2021

పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. అసలేం జరిగింది?

నటుడు పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. అమీర్ పేటలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని ఇంటిపై అర్ధరాత్రి గర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇంటిపై పవన్ అభిమానాలు దాడి చేసినట్లు తెలుస్తోంది. పోసానిపై దుర్భాషలాడుతూ దుండగులు వీరంగం చేశారు. ఈ ఘటనపై ఆయన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోసాని కృష్ణ మురళి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

రెండు రోజులుగా కొందరు వ్యక్తులు పోసాని ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వాచ్‌మెన్ పోలీసులకు తెలిపాడు. గురువారం రాత్రి ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఎల్లారెడ్డిగూడలోని ఇంట్లో ఉండడం లేదు. గత 8 నెలలుగా రాయదుర్గంలోని ఇంట్లో ఆయన కుటుంబం నివసిస్తోంది. అయితే, పోసాని ఎల్లారెడ్డిగూడలోనే ఉంటున్నారని భావించి.. దండుగులు రాళ్ల దాడి చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవిండి: బీ అలర్ట్ ‘షహీన్‌’ తుఫాన్ వచ్చేస్తోంది….

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News