Friday, April 19, 2024

ఐపీఎల్ లో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ కొత్త రికార్డులు..

IPL 2021 లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ స‌రికొత్త రికార్డు సృష్టించాడు. లీగ్ చ‌రిత్ర‌లో ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా హ‌ర్ష‌ల్ నిలిచాడు. . ఈ సీజ‌న్‌లో మొత్తం 11 మ్యాచ్‌ల‌లో అత‌ని వికెట్ల సంఖ్య 26కు చేరింది. ఈ క్ర‌మంలో అత‌డు త‌న ఆర్సీబీ టీమ్ మేట్ య‌జువేంద్ర చాహ‌ల్ రికార్డును బ్రేక్ చేశాడు. 2015లో చాహ‌ల్ ఓ అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా 23 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ టీమ్ నుంచి హ‌ర్ష‌ల్‌ను తీసుకోవ‌డం ఆర్సీబీకి బాగా కలిసొస్తోంది. రాజ‌స్థాన్‌పై మూడు వికెట్లు తీయ‌డం ద్వారా ఒక సీజ‌న్‌లో ఆర్సీబీ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా కూడా హ‌ర్ష‌ల్ నిలిచాడు. గ‌తంలో ఈ రికార్డు కూడా 23 వికెట్ల‌తో చాహ‌ల్‌తోపాటు విన‌య్‌కుమార్ పేరిట ఉంది. ఈ మ‌ధ్యే ముంబైతో మ్యాచ్‌లో హ‌ర్ష‌ల్ హ్యాట్రిక్ కూడా తీసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక సీజ‌న్ ఐపీఎల్‌లో ఓ బౌల‌ర్ తీసిన అత్య‌ధిక వికెట్లు 32. 2013లో చెన్నై బౌల‌ర్ డ్వేన్ బ్రేవో ఈ రికార్డు సాధించాడు. ఇప్పుడు హ‌ర్ష‌ల్ ఆ రికార్డుపై కూడా క‌న్నేశాడు.

ఇది కూడా చదవండి: రాజస్తాన్ పై ఆర్సీబీ ఘనవిజయం

Advertisement

తాజా వార్తలు

Advertisement