Saturday, April 27, 2024

కోక కోసం కొట్టుకున్న ఖాకీలు… ఆఖరికి కొలువే గోవిందా..

సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన పోలీసులే దారితప్పుతున్నారు.. పోలీసులు ఒక్కోసారి చేసే తప్పులు యావత్ పోలీసుశాఖకే చెడ్డపేరు తీసుకువస్తాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. మహిళ కోసం కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. కోక తెచ్చిన గొడవ ఆ పోలీసు అధికారి వీఆర్ కి వెళ్లేలా చేసింది.. ఓ మహిళా కానిస్టేబుల్ కోసం ఒక సీఐ, మరో కానిస్టేబుల్ బహిరంగంగా కొట్టుకోవడం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే కోక కోసం నడిరోడ్డుపై కొట్టుకోవడం అందరూ వేలెత్తి చూపేలా చేసింది.

భీమవరం వన్ టౌన్ పోలీస్టేషన్లో ఓ లేడీ కానిస్టేబుల్ ని రాజేశ్ అనే కానిస్టేబుల్ బైక్ పై లిఫ్ట్ ఇస్తుండటాన్ని సీఐ కృష్ణ భగవాన్ చూసి తట్టుకోలేకపోయాడు. దీనితో ఈ విషయమై కానిస్టేబుల్ ని ప్రశ్నించి.. అజమాయిషీ చేసే తరుణంలో పర్సనల్ అనే మాట రావడంతో ఆ విషయం కాస్త చినికి చినికి గాలివానగా మారింది. ఆపై ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వచ్చింది. జిల్లాలో పోలీసుశాఖ పరువుని తీసిన ఈ ఘటన ఉన్నతాధికారులకు కోపాన్ని తెప్పించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. విచారణ చేసిన ఉన్నతాధికారులు సీఐ తప్పుకి పనిష్మెంట్ ఇస్తూ వీఆర్ కు పంపారు. ఆడదాని కోసం రాజ్యాలే పోయాయని పురాణాల్లో చదువుకున్నాం.. ఒక్క మహిళా కానిస్టేబుల్ కోసం ఒక పోలీసు అధికారి, మరో కానిస్టేబుల్ నడిరోడ్డుపై తన్నకోవడం భీమవరంలోచే చూస్తున్నామంటూ అక్కడవారంతా బహిరంగంగానే పోలీసుల చేసిన ఘటనపై దుమ్మెత్తి పోశారు. ఎంతవారలైనా కాంత దాసులే అనడానికి కోక కోసం పోలీసుల కొట్లాట ఉదాహరణగా చెప్పొచ్చేమో.

Advertisement

తాజా వార్తలు

Advertisement