Monday, April 29, 2024

ఏకగ్రీవంగా జ‌న‌సేన‌ అభ్యర్థి..కాసుబోయిన రాఘవ…

కడియపులంక-3 ప్రాదేశిక నియోజకవర్గంలో జరగాల్సిన ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ స్థానంలో జనసేన పార్టీ నుండి నామినేషన్ వేసిన ఎంపీటీసీ అభ్యర్థి కాసుబోయిన రాఘవ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత సంస్థాగత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని నూనె విజయనిర్మల ఈ స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు అకాలమరణం చెందిన విషయం విదితమే.ఫలితంగా వచ్చిన ఉపఎన్నికలో జనసేన పార్టీ సానుభూతిని ప్రదర్శించి.. స్వర్గీయ విజయనిర్మల కుమార్తె కాసుబోయిన రాఘవను ఎంపికచేసి నామినేషన్ వేయించింది.దీనిపై పోటీకి దిగాలా?వద్దా? అనే మీమాంసలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.

రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ కూడా ఈ పరిస్థితుల పై కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే మండల పార్టీ క్యాడర్ తో రెండుసార్లు సమావేశం కూడా నిర్వహించారు. అలానే జనసేన జిల్లా రథసారిది కందుల దుర్గేష్ కూడా సంప్రదాయంగా కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ కు ఫోన్ కూడా చేశారు.పార్టీ ఏదయినా చనిపోయిన అభ్యర్థి కుటుంబానికి గౌరవం ఇవ్వడం మంచి పరిణామం గా దుర్గేష్ తెలిపారు. అందుకు చందన కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది. నామినేషన్ గడువు నేటితో ముగుస్తున్నందున వైసీపీ తన నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది.

వైసీపీ మండల నాయకత్వం కూడా కాసుబోయిన కు ఏకగ్రీవంగా ఇస్తేనే బాఉంటుందని భావిస్తోంది.అలానే గ్రామస్థాయిలో కూడా ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఏకగ్రీవానికి ఓటేస్తున్నారు.ఈ నియోజకవర్గంలో జన‌సేన‌కి పట్టుంది. పోటీ చేసినా జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి.వైసీపీ గెలిచినా తన బలం అంకె మారుతుంది తప్ప వేరే ఏ విధమైన ప్రయోజనం లేదు.అయినప్పటికీ ఇగోలకు పోకుండా దుర్గేష్ ఫోన్ చేయడం చందన తన నిర్ణయం వెల్లడిస్తామని సానుకూలంగా తెలపడం ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం తెలియజేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement