Wednesday, May 1, 2024

‘స్టూవ‌ర్ట్ పురం దొంగ‌’గా బెల్లంకొండ శ్రీనివాస్ ఫ‌స్ట్ లుక్…

స్టూవ‌ర్ట్ పురం దొంగ‌గా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఫ‌స్ట్ లుక్ అదిరింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ గా మారింది. స్టూవ‌ర్ట్ పురం దొంగ చిత్రంలో న‌టిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. చిత్ర బృందం ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ పొడ‌వాటి జుట్టు తో, గుబురు గ‌డ్డంతో ఉన్నాడు. అలాగే చేతిలో రెండు తుపాకులు ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్ ఇచ్చాడు. ఈ సినిమా లో బెల్లం కొండ శ్రీ‌నివాస్ దొంగ పాత్ర‌లో నటిస్తున్నాడు. అయితే బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసిన కొద్ది స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది.ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా కె ఎస్ ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను స్టూవ‌ర్ట్ పూరంలోని గ‌జ దొంగ అయిన నాగేశ్వ‌ర రావు జీవిత క‌థ ఆధారం తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement