Wednesday, May 8, 2024

కాంతారా2 లోడింగ్.. పోస్ట్ పెట్టిన ఊర్వ‌శి రౌతెల్లా

కాంతార చిత్రం ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిన విష‌య‌మే.ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్క‌నుంద‌ని ముందే చెప్పారు. కాగా బాలీవుడ్ న‌టి ఊర్వశి రౌతెల్లా షేర్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. కాంతారా హీరో రిషబ్‌ శెట్టిని కలిసిందీ అందాల తార. ప్రస్తుతం వీరిద్దరి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాంతారా 2 సినిమాపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ సినిమాలో రిషబ్‌తో కలిసి ఎవరు నటిస్తారు అన్న ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఊర్వశి షేర్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది.రిషబ్‌ శెట్టితో కలిసున్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘కాంతారా 2’ లోడింగ్ అని క్యాప్షన్‌ ఇచ్చింది ఊర్వశి. తన పోస్టుకు రిషబ్, హోంబలే ఫిల్మ్స్‌లను ట్యాగ్ చేశాడు.కాగా ‘కాంతారా’ చిత్రానికి సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ ఉంటుందని రిషబ్‌ శెట్టి ఇటీవలే ప్రకటించారు. దీంతో ఈ సినిమాలో ఎలాంటి కథ చెప్పబోతున్నాడు అన్న ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement