Saturday, May 4, 2024

కళ్యాణం కమనీయంకి.. క్లీన్ యు సర్టిఫికెట్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తోన్న చిత్రం కళ్యాణం కమనీయం.ఈ చిత్రంలో ప్రియ భవానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.కాగా సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను తెలియజేశారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement