Wednesday, November 29, 2023

Danger Bells: పగబట్టిన కాలనాగు, బైకులో దాక్కుని మరీ కాటేసింది.. మ‌ణుగూరులో ఘ‌ట‌న‌!

వానాకాలం సీజ‌న్‌.. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో పాటు పాములు కూడా ఇండ్ల‌లోకి వ‌స్తుంటాయి. ఇట్లానే భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా మ‌ణుగూరులో ఓ వ్య‌క్తి బైకు న‌డుపుతుంటే నాగుపాము కాటేసింది. మ‌ణుగూరు మండ‌లం ప‌గిడేరు గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తెల్లం బుచ్చిరాములు తన ఇంటి నుంచి బైక్‌పై వెళ్తుంటే పాము కాటేసింది. ఆ పాము బైక్‌లో ఎప్పుడు, ఎలా చొర‌బ‌డిందో తెలియ‌క అత‌ను య‌థావిధిగా బైక్‌పై వెళ్తుంటే ఇట్లా జ‌రిగింది.

- Advertisement -
   

వెంట‌నే అత‌డిని మ‌ణుగూరు ఏరియా ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ట్రీట్‌మెంట్ జ‌రుగుతోంద‌ని, ప‌రిస్థితిని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని డాక్ట‌ర్లు అంటున్నారు. వ‌ర్షాకాలం సీజ‌న్‌లో బైకుల్లోనే కాకుండా ఇంట్లో, గుమ్మం ముంగిట ఉన్న చెప్పులు, షూస్‌లో కూడా పాములు, తేళ్లు.. ఇత‌ర విష కీట‌కాలు ఉండే ప్ర‌మాదం ఉంది. అందుక‌ని ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించిన త‌ర్వాత వ‌స్తువుల‌ను వాడాల‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement