Tuesday, May 7, 2024

జూన్ 30న క‌డువా మూవీ రిలీజ్

జూన్ 30న క‌డువా మూవీ రిలీజ్ కానుంది. మ‌ల‌యాళ న‌టుడు పృథ్విరాజ్ సుకుమార‌న్ న‌టించిన కడువా చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 30న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్ల‌ను జోరుగా జ‌రుపుతుంది. ప్ర‌స్తుతం సౌత్‌లోని నాలుగు సిటీల‌లో ప్ర‌మోష‌న్లు చేయ‌డానికి బృందం ప‌య‌న‌మైంది. ఇప్ప‌టికే బెంగ‌ళూర్‌లో ప్రెస్‌మీట్ నిర్వ‌హించగా.. శ‌నివారం హైద‌రాబాద్‌లో అవాస హోట‌ల్‌లో సాయంత్రం నాలుగు నుండి ప్రెస్ కాన్ఫ‌రెన్స్ జ‌రగ‌నుంది. ఈ ప్రెస్ మీట్‌లోనే తెలుగు టీజ‌ర్‌ను కూడా మేకర్స్ విడుద‌ల చేయ‌నున్నారు. షాజి కైలాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది. వివేక్ ఓబెరాయ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించాడు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి పృథ్విరాజ్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement