Saturday, April 27, 2024

ఉగ్ర‌వాది సాజిద్ మీర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష‌

2008లో ముంబైలో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడుల్లో నిందితుడైన సాజిద్ మ‌జీద్ మీర్‌కు పాకిస్థాన్‌లో 15 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. టెర్ర‌ర్ ఫైనాన్సింగ్ కేసులో ఆ దేశ యాంటీ టెర్ర‌రిజం కోర్టు ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. సాజిద్ మ‌జీద్ మీర్ త‌ల‌పై అమెరికాలో 50 ల‌క్ష‌ల డాల‌ర్ల న‌జ‌రానా ఉంది. ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్‌(ఎఫ్ఏటీఎఫ్‌) అధికారులు పాకిస్థాన్‌లో విజిట్ చేయ‌నున్న నేప‌థ్యంలో ఆ దేశం సాజిద్ మీర్‌ను అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే గ‌డిచిన ఏప్రిల్ నుంచి లాహోర్‌లోని కోట్ ల‌క్‌ప‌తి జైలులోనే మీర్ ఉంటున్నాడ‌ని ఆయ‌న త‌ర‌పు లాయ‌ర్ తెలిపారు. సాజిద్ మీర్ నిషేధిత ల‌ష్క‌రే తోయిబా సంస్థ‌లో పనిచేశారు. సాజిద్ మీర్ చ‌నిపోయిన‌ట్లు గ‌తంలో పాకిస్థాన్ చెప్పినా.. ఆ విష‌యాన్ని ప‌శ్చిమ దేశాలు న‌మ్మ‌లేదు. దీంతో టెర్ర‌ర్ ఫైనాన్సింగ్ కేసులో ఈ అంశం కీల‌కంగా మారింది. పాకిస్థాన్‌పై వ‌త్తిళ్లు పెరిగాయి. ఆ త‌ర్వాత సాజిద్ మీర్‌ను పాకిస్థాన్‌ అరెస్టు చేయాల్సి వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement