Thursday, May 9, 2024

Exclusive | మరికాసేపట్లో జడ్జిమెంట్​..  వనమాకు తీర్పు అనుకూలమేనా!

భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదన్న తీర్పుపై ఆయన హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు. నిన్న (బుధవారం) విచారణకు స్వీకరించిన సింగిల్​ బెంచ్​ జడ్జి ఇరు వైపులా వాదనలు విన్నారు. ఆ తర్వాత తీర్పును రిజర్వు చేశారు.  కాగా, ఇవ్వాల (గురువారం) తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టుకు వెళ్లేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని వనమా కోరారు.  అయితే.. తనకు అనుకూలంగానే తీర్పు వస్తుందన్న ఆశాభావం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వ్యక్తం చేశారు.  మరికొద్ది సేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో అందరిలోనూ టెన్షన్​ నెలకొంది.

2018 ఎన్నికల అఫిడవిట్​లో తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావు 2019లో హైకోర్టుకు వెళ్లారు. దీనిపై మూడేండ్లుగా వాదనలు జరిగాయి. జులై 25న (మంగళవారం) కోర్టు తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నిక చెల్లదని, ఆయనపై అనర్హత వేటు వేయడంతోపాటు 5 లక్షల జరిమానా విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement