Monday, May 13, 2024

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. 1044 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

ఇండియన్‌ రైల్వే మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండా ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తోనే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయనున్నారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో వివిధ ట్రేడ్‌లలో ఖాళీగా ఉన్న 1044 అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వ‌చ్చింది. ఈ పోస్టులను నాగ్‌పూర్‌ డివిజన్‌ వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.

రైల్వే జాబ్ కు సంభందించిన వివ‌రాలు..

రైల్వే జాబ్స్ కు మొత్తం ఖాళీల సంఖ్య 1044. నాగ్‌పూర్‌ డివిజన్‌–980, వర్క్‌షాప్‌ మోతీబాగ్‌–64 లో దీనికి సంభందించిన‌ ఖాళీలున్న‌యి. ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, మెషినిస్ట్, టర్నర్, డిజిటల్‌ ఫోటోగ్రాఫర్, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, గ్యాస్‌ కట్టర్, స్టెనోగ్రాఫర్, కేబుల్‌ జాయింటర్‌ తదితరాలు. అర్హత పొందేందుకు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ఉండ‌వ‌ల‌సిన‌ వయసు 01.05.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం.. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది జూన్‌ 03, 2022 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement