Sunday, April 28, 2024

జ‌యం చిత్రానికి 20ఏళ్లు-ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన నితిన్

జ‌యం సినిమా రిలీజ్ అయి నేటితో 20సంవ‌త్స‌రాలు అయింది. ఈ మేర‌కు హీరో నితిన్ ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ ని పంచుకున్నారు.
ఇర‌వై సంత్స‌రాల క్రీతం ఇదే రోజు నా మొద‌టి చిత్రం జ‌యంతో సినీ ప్ర‌యాణాన్ని ప్రారంభించాను. నాలోని న‌టుడిని గుర్తించి, నాకు మొద‌టి బ్రేక్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు తేజ గారికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్వవాదాలు. ఇప్ప‌టివ‌ర‌కు నేను చేసిన ప్ర‌తి సినిమా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అంద‌రికి ధ‌న్య‌వాదాలు. మీరు లేకుండా నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. లాస్ట్ బ‌ట్ నాట్ ద లీస్ట్ న‌న్ను ఇంత‌గా ఆధ‌రిస్తున్న నా అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు’ అంటూ ఎమోష‌నల్ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement