Thursday, May 9, 2024

ఈనెల 29న ‘జగనన్న విద్యాదీవెన’ అమలు: సీఎం జగన్

ఏపీలోని అన్నిజిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిరంతరాయంగా జరగాలని అధికారులకు స్పష్టం చేశారు. 104 కాల్ సెంటర్.. వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈనెల 9 నుంచి 23 వరకు రైతుభరోసా చైతన్య యాత్రలు చేపట్టాలన్నారు. ఆర్‌బీకేల విధివిధానాలు, సీఎం యాప్‌ పనితీరు, ఈ-క్రాపింగ్‌, వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ తెలిపారు. విత్తనాల నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలనలు చేయాలని, నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద పంపిణీ చేసిన భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, హార్టికల్చర్‌, సెరికల్చర్‌లు ఆయా భూముల్లో సాగయ్యేలా చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామని, 22న వైఎస్‌ఆర్‌ కాపునేస్తం, 29న జగనన్న విద్యాదీవెన అమలు చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇంతకాలం గాడిదలు కాశావా అంటూ అశోక్ గజపతిపై విజయసాయిరెడ్డి ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement