Wednesday, May 1, 2024

Jagan Vs Chandrababu – ఆర్జీవి పొలిటిక‌ల్ పంచ్ – జ‌గ‌న్ ‘వ్యూహం’ మూవీ టీజ‌ర్ రిలీజ్

YouTube video

రామ్ గోపాల్ వ‌ర్మ తాజా మూవీ వ్యూహం …ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బ‌యోపిక్ గా ఈ మూవీని ఆర్జీవి రూపక‌ల్ప‌న చేస్తున్నారు.. ఈ మూవీ తొలి షెడ్యూల్ ముగిసిన వెంట‌నే జ‌గ‌న్ బ‌యోపిక్ కాదు… అంత‌కు మించి అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు ఈ వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు.. ఎపిలోని జ‌గ‌న్,చంద్ర‌బాబు మ‌ధ్య ఉన్న రాజ‌కీయ శ‌తృత్వాన్ని ఈ మూవీలో జ‌గ‌న్ కు అనుకూలంగా స్క్రిప్ట్ రెడీ చేసి షూటింగ్ కు దిగిన రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ఆ మూవీ టీజ‌ర్ ను నేడు జ‌నంలోకి వ‌దిలారు..వైఎస్ ఆర్ మ‌ర‌ణంతో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్ లో సిబిఐ జ‌గ‌న్ అరెస్ట్ వంటి విష‌యాల‌ను లైట్ గా ట‌చ్ చేశాడు.. అధికారం కోసం చంద్ర‌బాబు ఎంత‌లా ప‌రిత‌పించుబోతున్నారో టీజ‌ర్ లో స్ప‌ష్టంగా చూపారు.. అలాగే జ‌గ‌న్ అరెస్ట్ త‌ర్వాత భార‌తి ప‌డిన ఇబ్బందులు సెంటిమెంట్ పూసి తెర‌కెక్కించారు.. అధికారం కోసం ఎంత‌కైన చంద్ర‌బాబు తెగిస్తార‌నే సందేశాన్ని ఆర్జీవి ఈ టీజ‌ర్ లో నిక్క‌చ్చిగా చూపారు.. ఈ టీజ‌ర్ ఇప్పుడు ఎపి రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న‌ది.. మీరూ ఈ టీజ‌ర్ ను చూడండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement